గురుకుల హాస్టల్ లో దుర్వాసన

– అనారోగ్య బారిన విద్యార్థులు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మిరు దొడ్డి : గురుకుల పాఠశాలలో విద్యార్థులకు దుర్వాసన మొదలైంది ప్రతిరోజు వంట చేస్తున్న గది పక్కన నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులకు మరియు రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులకు పూర్తిగా దుర్వాసన రావడంతో ప్రజలు తీర ఇబ్బందులకు గురవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం చెప్యాల చౌరస్తా లోని గురుకుల హాస్టల్ ఎదుట దుర్గంధం వెదజల్లుతుంది. హాస్టల్లో ఉన్నటువంటి మురికి నీరు బస్టాండ్ ఆవరణ లో ఉన్నటువంటి మురికి కాలువలో నిల్వ ఉండడంతో దుర్గంధం రావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గురుకుల హాస్టల్ లో ఉన్నటువంటి మురికి నీరు మురికి కాల్వలో నిల్వ ఉండకుండా చూడాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు. బస్సు షెల్టర్ వద్ద ప్రయాణికులు నిల్చడానికి దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పలుమార్లు అధికార దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుర్గంధం రాకుండా మూర్కినీరు నిలువ లేకుండా చూడాలని కోరుతున్నారు. లేదంటే ప్రయాణికులు వాహనాదారులతోపాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.