నవతెలంగాణ – వేములవాడ
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. రాజన్న ఆలయానికి సోమవారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం చేసుకొని మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం తీయడం ఆనవాయితీ. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించేందుకు వచ్చారు. డప్పు చప్పుళ్లు, శివ సత్తుల నృత్యాలు, నెత్తిన బోనాలతో చేసిన నృత్యాలు చేస్తూ, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ఒడి బియ్యం, పట్నాలు, నైవే్యాన్ని సమర్పించారు. అనంతరం కల్లు సాక పోసి బద్దిపోచమ్మ తల్లిని వేడుకున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయంలో తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.