మండలంలోని దామెరవాయి గ్రామానికి చెందిన మోరె బిక్షపతి(45) మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చంపేశాడు. మృతి చెందిన మోరే బిక్షపతి దహన సంస్కారాలకు ములుగు జిల్లా ఇన్చార్జి, ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ బడి నాగజ్యోతి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసివచ్చి సందర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం అందించారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. అనంతరం వారి అంత్యక్రియల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోరే బిక్షపతి చాలా మంచి మనిషిని, చాలా ఉదార స్వాభావం గల రైతు అని కొనియాడారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు మరెవ్వరికి జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ మండల అధ్యక్షుడు నూశెట్టి రమేష్, మాజీ సర్పంచ్ మేడిశెట్టి నరసింహయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు రతన్, టిఆర్ఎస్ యూత్ నాయకులు సీనియర్ నాయకులు రజాక్ గయాజ్, రామిల్ల పెద లాలయ్య, సాయిరి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.