
ఇటీవల సంభవించిన వరద బాధితులకు పూర్తిస్థాయిలో అండగా నిలిచాము అనీ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన తాహసిల్దార్ అల్లం రాజకుమార్ ఆధ్వర్యంలో వరదల్లో మృతి చెందిన ప్రాజెక్టు నగర్ కుటుంబానికి 15 లక్షల రూపాయలు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగజ్యోతి హాజరై బాధిత కుటుంబానికి చెక్కులు అందించి మాట్లాడారు. మన ములుగు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గూడు లేని నిరు పేదలకు అవసాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.ప్రతి ఒక్కరికి నీడ కల్పించే విధముగా ముఖ్యమంత్రి ఇల్లు మంజూరు చేస్తున్నారు. పేద వారి ఇంటి కల నెరవేరబోతుంది అని జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ హరిబాబు,మండలం అధ్యక్షులు సూరపనేని సాయిబాబా, కో ఆప్షన్ సభ్యులు ఎండీ బాబర్, ఆలూరి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, చక్రపాణి, సర్పంచ్ లు సంపత్, మోహన్ రాథోడ్ ఉపసర్పంచ్ అల్లంనేని హన్మంతరావు, జిల్లా సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షులు వివిధ హోదలో వున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.