
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బడి తండా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మిక సిబ్బందికి రైన్ కోట్ అందించినట్లు పంచాయతీ కార్యదర్శి కోమటి గణేష్ గురువారం తెలిపారు. గురువారం బడి తండా గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బంది. ఈ సీజనల్ వర్షాల్లో తడిసి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రైన్ కోట్ అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాలకు తడిసి విష జ్వరాలతో ఇబ్బందులకు గురికాకుండా ఉండి గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామ అభివృద్ధికి కృషి చేసేందుకు ఈ కార్యక్రమంలో అన్నారు.