ఉపాధి హామీ పనుల వద్దనే బడిబాట కార్యక్రమం

నవతెలంగాణ – శంకరపట్నం
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడి పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రధానోపాధ్యాయుడు భూమి రెడ్డి, అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని ఎరడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్దనే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మాట్లాడుతూ..ఉదయం పూటనే ప్రజలందరూ ఉపాధి హామీ  పనులకు వెళుతున్నారని తెలుసుకొని వారి వద్దకే వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసిందని ఈ కమిటీల ద్వారా పాఠశాలకు అవసరమయ్యే, మౌలిక వసతులను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 20 నుండి 30 సంవత్సరముల అనుభవము కలిగిన ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారని  ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించినట్లైతె మీకు ఆర్థిక భారం తప్పుతుందని మరియు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందుతుందని ఉపాధి హామీ పనులలో ఉన్న తల్లులకు తెలిపారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మేము ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే భూమ్ రెడ్డి, ఉపాధ్యాయులు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న, ఇరు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరామిరెడ్డి,శ్రీమతి లక్ష్మీ స్వరూప, మరియు చైర్మన్ జ్యోతి,తో పాటు గ్రామ సెక్రటరీ రవి,  పాల్గొన్నారు.