మండల ప్రత్యేక అధికారి పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని కస్తూర్బ పాఠశాల అలాగే ఎంపీపీ ఎస్ ఉప్పర్ల కేసారం పాఠశాలలను సందర్శించి, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయరాలిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పాఠశాలలో ఉన్న వసతుల గురించి ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం చేసి, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వండి పెట్టాలనీ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో బి శైలజ రాణి, కేజీబీవీ ప్రిన్సిపాల్ మంజుల పంచాయతీ కార్యదర్శులు సరిత, అమల, ఉపాధ్యాయినిలు సుజాత తదితరులు పాల్గొన్నారు.