
నవతెలంగాణ – అశ్వారావుపేట
బడిబాట ముగింపు సంబురాల్లో భాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో బుధవారం క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. వాలీబాల్,కబడ్డీ,టెన్నీకాయిట్, చదరంగం వంటి ఆటల పోటీలు నిర్వహించి విద్యార్ధులకు బహుమతులు అందచేశారు.మండల కేంద్రంలోని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లక్సు ప్రధానోపాధ్యాయులు పి.హరిత క్రీడలను ప్రారంభించారు.మానసిక ఉల్లాసం,శారీరక దారుఢ్యం కోసం విద్యార్ధి దశలో క్రీడలు ఎంతో అవసరమని అందుకే బడిబాట చివరి రోజున ఆటల పోటీలు నిర్వహించి విద్యార్ధుల్లో నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. కాంప్లెక్సు లో బడిబాట క్యాంపెయిన్ ద్వారా 120 అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు.వివిధ తరగతులకు ఆటలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.