బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

– హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.మల్లేశం
– ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-శంషాబాద్‌
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని శంషాబాద్‌ మండల పరిధిలోని హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.మల్లేశం శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక్‌ ప్రారంభించారని తెలిపారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో 5 ఏండ్ల నుండి 14 ఏండ్ల లోపు ఉన్న బడీడు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ.. శుక్రవారం ఇంటింటి ప్రచారం చేస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్‌ మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య అన్ని రకాల సదుపాయాలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు ఏమాత్రమూ సంకోచించ కుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారికి మంచి నాణ్యమైన తెలుగు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేస్తూ భవిష్యత్తు ను తీర్చిదిద్దుతామని అన్నారు. ఆడంబరాల కోసం ప్రయివేట్‌ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి అప్పుల పాలు కావద్దని సూచించారు. బడిబాట కార్యక్రమా నికి తమ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నా రు. ప్రభుత్వ పాఠశాలల విలువను గొప్పతనాన్ని గురించి వారికి వివ రించారన్నారు. ఈ నెల 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్ర మాన్ని నిర్వహిస్తు న్నామని అవకాశాన్ని తల్లిదం డ్రులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.