
ములుగు జిల్లా నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ( NSF ) విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులుగా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బాడిశ సువాస్ ను, మంగళవారం నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ , ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోగు సుధాకర్ లు శాల్వాలు కప్పి బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా పనిచేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన ఎన్ఎస్ఎఫ్ ములుగు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బాడిశ సువాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా విద్యార్థి విభాగానికి అధ్యక్ష పదవి అప్పగించినందుకు, నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్, నాయకులు గోగు సుధాకర్, దుర్గం ప్రేమ్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి లోకానికి తమ వంతుగా సేవ చేస్తానని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతగాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్, సంఘం నాయకులు కోగు సుధాకర్ దుర్గం ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.