నిజాలు రాబట్టాలంటే
నైజాలు బయటపడాలి
తూర్పారబడితేనే
చెత్తాచెదారం తొలిగిపోయేది
ముసుగులు తొలగిస్తేనే
అసలు రూపం బయటపడేది
చేష్టలు కప్పిపుచ్చుకునేందుకే
దుష్ప్రచారం చేస్తున్నారు
వాస్తవాలు వెలుగు
చూస్తాయేమోనని
ఉక్రోషంతో భౌతికదాడి
సదా చేస్తున్నారు
సాక్ష్యం చూపిస్తుంటే
తగవుకొస్తున్నారు
వేమన చెప్పిన సత్యాలు
బుర్రలో పూడ్చేసారు
గడ్డితినేమందమతి
బడుద్దాయులూరికే
నోరుపారేసుకుంటారు
కాని నిజానికి వారంతా
కళ్ళున్న గుడ్డివాళ్ళు
ఏదో వొక ముసుగులో
ఏదో విధంగా తగువుకొచ్చి
తన్నులు తింటారే కాని
పచ్చి నిజాలు ఒప్పకోరు.
అడ్డదిడ్డంగా వాదించడం
గుడ్డెద్దు చేలో పడటం
మూర్ఖంగా యోచించడం
బత్తాయి గుంపు లక్షణం
నిజం యెప్పుడు చేదు మాత్ర!
వేయకుంటే వున్న రోగం పోదు!
వాపును బలుపనుకుంటూ
పాచినోట నీతులుచెప్పటం!
చదువున్న వారు సైతం
శాస్త్రీయంగా యోచించరు
వీరికన్న లోక జ్ఞానం వున్న
నిరక్షరాస్యులే యెంతోనయం
కుంటిసాకు స్తోత్రాలు
కంటితుడుపు మంత్రాలు
పాపహరణ దానాలు
వేదాలు వల్లించు దెయ్యాలు
ఈ మూకుమ్మడి
వదరుబోతులకు
చింతబరికెల బడితపూజ
అనివార్యం
తప్పుడోళ్ళను తన్ని
తరిమితేగాని బుద్ధిరాదు
అందుకే
ప్రశ్నిస్తే వణికిపోతున్నారు
శిశ్నాన్ని ఖండించినంతగా
తెగ బాధపడుతున్నారు
తలబొప్పికట్టినా గ్రహించరు
మేకపోతు గాంభీర్యం
ఉన్మాదపుటాలోచనతో
పగతీర్చుకోటానికిజి
ఎగేసుకుని దౌర్జన్యం చేస్తూ
పైశాచిక ఆనందంతో
ఆగడాల చిందులతో
నిజాలను చంపేస్తారు
అబద్ధాలే అల్లుతుంటారు
నిత్యం అకత్యాల బొక్కలు
మెడనలంకరించుకుంటారు
అదేదో మగతనమని
భ్రమిస్తుంటారు?
– కపిల రాంకుమార్, 9849535033