ముగిసిన బ్యాడ్మింటన్‌ టోర్నీ

ముగిసిన బ్యాడ్మింటన్‌ టోర్నీహైదరాబాద్‌ : బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. ఆర్‌3 అకాడమీలో జరిగిన పోటీల్లో అండర్‌-13 బాయ్స్ విభాగంలో విదిత్‌ రెడ్డి, రవి కిషోర్‌ జోడీ డబ్సుల్‌ విజేతగా నిలువగా.. బాలికల విభాగంలో ఆరాధ్య, మానస్వీ చాంపియన్లుగా నిలిచారు. అండర్‌-11 బాలికల విభాగంలో నిమ్మ శ్రావ్య ట్రోఫీ దక్కించుకుంది. నిరంతర సాధనతోనే చాంపియన్లు తయారవుతారని కోచ్‌ భాస్కర్‌బాబు అన్నారు. మల్కాజిగిరి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.