డాక్టర్ భూపతిరెడ్డిని కలిసిన బాడ్సి గ్రామస్తులు

నవతెలంగాణ- మోపాల్ : మోపాల్ మండలంలోని బాడ్సి గ్రామంలో గల ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎలక్షన్ నామినేషన్ నిమిత్తం 10000 రూపాయలను రూరల్ కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భూపతిరెడ్డి కచ్చితంగా గెలిచి తీరుతారని 50 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఆయనను గెలిపించుకుంటామని వారు తెలిపారు. అలాగే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని సోనియమ్మ కానుకగా రూరల్ అభ్యర్థిని గెలిపించి తీరుతామని వారు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి మరియు డిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.