బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి

– రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాలలో ప్రజల నీరాజనం.
కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ- రెంజల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాలలో పర్యటించగా, అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తక్షణమే అమలు చేస్తుందని ఆయన అన్నారు.  కరెంటు విషయంలో రైతాంగం ఆందోళన చెందవలసిన అవసరం లేదనికొని 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ను గృహాలకు ఉపయోగించే విద్యుత్తు బిల్లులను మాఫీ చేస్తుందన్నారు. రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలను వడ్డీ మాఫీ వర్తింప చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ధనుంజయ్, జి సాయి రెడ్డి, జావిద్ ఉద్దీన్, లచ్చే వార్ నితిన్, బీసీ సెల్ మండల అధ్యక్షులు గోసుల గంగా కిషన్, మండల ఉపాధ్యక్షులు గంగా కృష్ణ, గయాసుద్దీన్, సాయిబాబా గౌడ్, యువజన నాయకులు కార్తీక్ యాదవ్, గైని కిరణ్, సిద్ధ సాయిలు, శంషాద్దిన్, సయ్యద్ సల్మాన్, ఎల్ కృష్ణ, షహబాజ్, తదితరులు పాల్గొన్నారు.