బడుగు, బలహీనవర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపాలి

– ఐఏఎస్‌ విజేతలను అభినందించిన మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యావత్‌ తెలంగాణ ప్రజలు గర్వించేలా పలువురు ఐఏఎస్‌లో ర్యాంకులు సాధించారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలిసిన ఐఏఎస్‌ ర్యాంకర్లు నిధి, ఆర్‌.నవీన్‌, దీప్తీ చౌహన్‌, సాయినాథ్‌ , అక్షరులకు ఆయన పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఎంత పట్టుదలతో చదివి లక్ష్యం సాధించారో అంతే అకుంఠిత దీక్షతో సమాజానికి సేవ చేయాలనీ, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.