బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి నిజామాబాద్ నగర అధ్యక్షులుగా ఎం.అజయ్ 

నవతెలంగాణ- కంటేశ్వర్
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి నగర అధ్యక్షులు గా  అజయ్ ను బహుజన  లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి  జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ..తెలంగాణలో సమాజంలో 93% ఉన్న  బహుజన ప్రజలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి కుల, వర్గ సంఘాల  నిర్మాణం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలనే  సామాజిక న్యాయ పోరాట సైద్ధాంతిక పునాదులపై నిర్మాణమైన  బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజనులు చేరి కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బిఎల్ పి జిల్లా కన్వీనర్ కె.మధు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి , బిఎల్ పి నగర నాయకులు టి‌.రాజు, సహాదేవ్, బిఎల్ టియు నగర అధ్యక్షులు టి.రాజు, ఎస్.హరిష్ తదితరులు పాల్గొన్నారు.