బహుజన లెఫ్ట్ పార్టీ అధ్యక్ష , కార్యదర్శుల ఎన్నిక

Bahujan Left Party President and Secretary Electionనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి జిల్లా కార్యాలయంలో సబ్బని లత అద్యక్షతన జరిగిన పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పర్యవేక్షణలో 17 మందితో జిల్లా నూతన కమిటిని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా సబ్బని లత,  ఉపాధ్యక్షులుగా టి.రాజు ఎస్సీ మాల  నిజామాబాద్, సాయి కుంబ్లే ఎస్సీ మాదిగ  నిజామాబాద్, ప్రధాన కార్యదర్శిగా – అబ్బగోని అశోక గౌడ్ బాల్కొండ,సహయ కార్యదర్శులుగా బి. జగదీష్ ఎస్సీ మాల జంగం బాల్కొండ,ఎం.డి.సయ్యద్  ముస్లిం డిచ్ పల్లి, కోశాధికారిగా దండు జ్యోతి బిసి గంగపుత్ర ఆర్మూర్, జిల్లా కమిటి సభ్యులు గా రాజేందర్ ఎస్సీ మాదిగ, శంకర్ ఎస్సీ మాదిగ, మోహన్ గౌడ్ బిసి, యాదయ్య  ఎస్సీ మాదిగ, గీతాంజలి ఎస్సీ మాల, బాల్ రాజ్ బిసి గంగపుత్ర  జాన్కంపేట్, సుజాత బిసి గంగపుత్ర డిచ్ పల్లి, జి.శ్రీమాన్ పద్మశాలి  నిజామాబాద్ జిల్లా , ఎం.అజయ్ ఎస్సీ మాల నిజామాబాద్, చంద్ర గౌడ్ నిజామాబాద్ లను ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ.. మార్క్సిజం అంబేడ్కరిజం సైద్ధాంతిక రాజకీయ ఆలోచన విధానంతో పని చేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) భారతీయ నమూనా మార్క్సిజం అంబేడ్కరిజం సైద్ధాంతిక రాజకీయ ఆలోచన విధానంతో బహుజన శ్రామిక ప్రజలకు రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్నారు.బహుజన లెఫ్ట్ పార్టీ ఒకవైపు కార్మిక సంఘాల నిర్మాణం, మరోవైపు కుల సంఘాల నిర్మాణం ద్వారా కుల, వర్గ పోరాటాల ద్వారా కుల వర్గ నిర్మూలన కోసం ఉద్యమిస్తున్నారు.