బహుజన రాజ్యాధికారమే బహుజన మహాసభ లక్ష్యం..

– బహుజన మహాసభ రాష్ట్ర కన్వీనర్ ఎర్ర జాన్సన్ మాదిగ..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన మహాసభ పనిచేస్తుందని బహుజన మహాసభ రాష్ట్ర కన్వీనర్ ఎర్ర జాన్సన్ మాదిగ  తెలిపారు. శనివారం పట్టణంలోనీ పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.నేడు ,(మార్చ్10) సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో జరిగే రాష్ట్ర ప్రథమహాసభకు వేలాదిగా ప్రజలు ,ప్రజాస్వామికవాదులు, బహుజన వాదులు తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో రోజురోజుకు పెచ్చరిల్లుతున్న మతోన్మాద ఫాసిజాన్ని నిలువరించాలంటే హిందూ అగ్రకుల కౌటిల రాజ్యాన్ని కూల్చాలని అన్నారు. దేశంలో నిచ్చెన మెట్ల కులాలుగా విభజించి పాలిస్తున్న అగ్రకుల రాజ్యాన్ని కూల్చడంకోసం అణగారిన  వర్గాల ప్రజలను ఐక్యం చేసి  మేమెంతో మాకంత వాటా కోసం బహుజన మహాసభ పోరాటం చేస్తుందని వివరించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ,ప్రొఫెసర్ చింతకింది కాశిం, గూడూరు సీతా మహాలక్ష్మి ,కె పర్వతాలు, చలకాని వెంకట్ యాదవ్, సాదు మాల్యాద్రి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు బత్తుల వెంకన్న, నార బోయిన వెంకట్ యాదవ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.