బహుజన సాహిత్య సామ్రాట్ ఆన్నాభావు సాఠే స్పూర్తితోసామాజిక విప్లవం కోసం ఉద్యమించాలి..

– బీఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ – దండి వెంకట్
నవతెలంగాణ- కంటేశ్వర్
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా, రచయిత, కవి, అంబేడ్కర్ భావజాల దృక్పథ ప్రచారాకుడిగా భారతీయ సమాజంలో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అన్నాభావు సాఠే స్పూర్తితో సామాజిక విప్లవం కోసం ఉద్యమించాలనిదండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో అన్నాభావు సాఠే 103వ జయంతి సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ.. కార్మికోద్యమ నేత అన్నాభావు సాఠే ఆగస్టు 1- 1920 వాటేగావ్, బొంబాయి ప్రెసిడెన్సీ లో జన్మించారని 18 జూలై 1969లో మరణించారు (వయస్సు 48) వారికు జీవించారని తెలిపారు. ఆయనకు ప్రజలు పెట్టిన పేర్లు సాహిత్య-సామ్రాట్, లోక్‌షాహిర్, అన్నాభౌ, సాహిత్యరత్నం, జహద్విఖ్యాత్, సంయుక్త మహారాష్ట్ర జనక్, సంయుక్త మహారాష్ట్ర శిల్పకర్, షిల్డార్, అగ్రిణి, దింజనాంచ స్ఫూర్తిదాతవృత్తిసంఘ సంస్కర్తప్రసిద్ధి చెందిందినవలా రచయిత, కవి, సినిమా స్క్రీన్ రైటర్ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, ఆయన పని చేసిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీపీఐలో పని చేశారని తెలిపారు. తుకారాం అన్నాభావు సాఠే చరిత్రను భారతీయ సమాజానికి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి అవసరం నేటి బహుజన సామాజిక విప్లవ శక్తులకు ఉందన్నారు. సూడో చరిత్రకారులు కార్మికోద్యమ నేత అన్నాభావు సాఠే లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చరిత్రను నేటి చరిత్రకు అందకుండా చేసారని విమర్శించారు.దాచబడిన చరిత్ర పేజీలను వెలికి తీసి అధ్యాయం చేయడం ద్వారా నూతన చరిత్ర నిర్మాణం జరుగుతుంది ఆయన అన్నారు. బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ అన్నాభావు సాఠే స్పూర్తితో బహుజన శ్రామిక మహిళలు శ్రమ దోపిడి తోపాటు బహుజన రాజ్యాధికారంలో మహిళలు సమాన వాటా కోసం ఉద్యమించండం ద్వారా అన్నాభావు సాఠే కు నిజమై నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాభావు సాఠే మాదిగ సంఘం నిజామాబాద్ నగర నాయకులు సిహెచ. రాజు, కాంబ్లీ సాయి, గాయక్వాడ్ కేశవ్, గంగాధర్ గాయక్వాడ్, సంతోష్ వాగ్మారే, భాస్కర్ సూర్య వంశీ , కరణ్ సూర్య వంశీ తదితరులు పాల్గొన్నారు.