బీసీ అభ్యర్థులకు బహుజన సేన మద్దతు : రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్

నవ తెలంగాణ – కాటారం
రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు బహుజన సేన మద్దతు ఉంటుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ అన్నారు. కాటారం మండలం చింతకాని గ్రామం లో జరిగిన లో జరిగిన బహుజన సేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బిసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుుపునిచ్చారు. మంథని శాసన సభ నియోజక వర్గం నుండి శాసన సభ అభ్యర్థిగా నిలబడిన బీసీ అభ్యర్థి పుట్ట మధుకర్ ని అధిక మెజార్టీ తో గెలిపించాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ ప్రజలను కోరారు. మేమెంతో మా వాట అంత అన్ని రంగాలలో దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అభ్యర్థులకు బహుజన సేన మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం భూపాల్ పల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య, అక్కినవెని సమ్మయ్య ముదిరాజ్ . ప్రసాద్ గౌడ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కాటరపు రాజమౌళి గౌడ్, ముక్కెర పూర్ణ, చంద్ర గౌడ్, తిరుపతి గౌడ్, దేవరపల్లి నవీన్, గడ్డం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.