
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
బహుజన వాదులారా ఏకం కావాలి అని మండల బహుజన వాది విజయ అన్నారు. మండలంలోని మనోరాబాద్ గ్రామంలో యశో బుద్ధ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగిందని విజయ్ బహుజనవాది తెలిపారు. ఈ సందర్భంగా బహుజన వాది విజయ మాట్లాడుతూ బహుజనుల ఇంటికి యశో బుద్ధ క్యాలెండర్ను అందించి బుద్ధుడు గురించి అంబేద్కర్ గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ గ్రామ బహుజనవాదులు పాల్గొన్నారు.