ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌– రూ.7వేల కోట్ల ఇష్యూకు దరఖాస్తు
న్యూఢిల్లీ : బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రావడానికి సెబీకి దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందులో రూ.4 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదే విధంగా మాతృసంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన రూ.3 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. అప్పర్‌ లేయర్‌ కలిగిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 2025 నాటికి స్టాక్‌ ఎక్స్‌ఛేÛంజీల్లో లిస్టింగ్‌ కావాలి. ఇప్పటికే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఎక్స్‌ఛేÛంజీల్లో లిస్టింగ్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే బజాజ్‌ హౌసింగ్‌ ఐపీఓకు రెడీ అవుతోంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు ఉపయోగించనుంది. బజాజ్‌ ఫైనాన్స్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,731 కోట్ల నికర లాభాలను సాధించింది.