పచ్చలనడ్కుడ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం: బాజిరెడ్డి గోవర్ధన్ 

– ఈ గ్రామానికి నాకు పూర్వ సంబంధం ఉంది
– బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పచ్చలనడ్కుడ గ్రామం అంటే నాకు చాలా ఇష్టమని, ఈ గ్రామానికి నాకు పూర్వ సంబంధం ఉందని బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాన్కంపేట్ నుండి పచ్చలనడ్కుడ కు త్రాగునీరు అందించేందుకు కృషి చేశానని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే, డబల్ ఇస్తా అంటేనే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి  ఓట్లు వేశారన్నారు. ఆదివారం వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తో కలిసి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… పచ్చలనడ్కుడ గ్రామం  అంటే నాకు చాలా ఇష్టం, ఈ గ్రామానికి నాకు పూర్వ సంబంధం ఉంది, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాన్కంపేట్ నుండి పచ్చలనడ్కుడ త్రాగునీరు అందించానన్నారు. స్థానికంగా ఉన్న ప్రశాంత్ రెడ్డి , కేసిఆర్ కి  అత్యంత సన్నిహితుడు, బాల్కొండ ప్రాంతానికి అనేక నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందు ఉంచారన్నారు. ఇంకా చేయడానికి ఎక్కడైనా మిగిలి ఉందా అంటే ఏమీ లేదని తెలిపారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి, పదేళ్లు తెలంగాణ పచ్చగా కళకళలాడేగా మార్చాడన్నారు. అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించారని తెలిపారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, జుట కోర్ రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పి, బిఆర్ఎస్ పార్టీ కంటే సంక్షేమ పథకాలపై డబల్ ఇస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లను దండుకొని గద్దెనెక్కిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ అదే ధోరణితో గ్రామాల్లోకి మళ్లీ మాయమాటలు చెప్పడానికి కాంగ్రెస్, బిజెపి నాయకులు వస్తున్నారని వారిని నిలదీయాలన్నారు. ఎలక్షన్ లో ఇస్తానన్న 4వేల పింఛన్, రుణమాఫీ, తులం బంగారం, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, రైతుబంధు, రైతు బీమా ఎక్కడని ఎక్కడికక్కడ నిలదీసి  అడుగుతే  సమాధానం చెప్పలేక పారిపోతారన్నారు. మన పార్టీ మన తెలంగాణ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ అని  కొట్లాడాలంటే మంచి సమయం వచ్చిందన్నారు.ప్రతి ఒక్కరూ పార్టీకి వచ్చే నెల 13వ తేదీన ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత పార్లమెంటు సమయంలో ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ అవ్వగానే పచ్చల నడుకుడా గ్రామం లాంటి గ్రామాల్లో ఉంటానని తెలిపారు. ఆశీర్వదించండి సేవకుల్లా పనిచేస్తాన్నారు. బిజెపి, కాంగ్రెస్ మోసపూరిత మాటలు వాగ్దానాలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని ఆయన ప్రజలకు వివరించారు.