బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొరకు పాదయాత్ర చేపట్టిన పార్టీ కార్యకర్త

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి: నిజాంబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొరకు మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన కొల్పేక పెద్దసాయిరెడ్డి మునిపల్లి గ్రామం నుండి నందిపేట మండల కేంద్రంలోని పలుగుట్ట ఆలయం వరకు పాదయాత్ర చేపట్టినట్టు కొలి ప్యాక్ పెద్ద సాయిరెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కొరకు ముని పెళ్లి గ్రామం నుండి నందిపేట మండల కేంద్రంలోని పలుగుట్ట ఆలయం వరకు పాదయాత్ర చేపట్టడంతో బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచినట్టు తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈసారి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.