నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండల కేంద్రంలో ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ బాజిరెడ్డి గోవర్ధన్ కి ఓటేయాలని మోపాల్ మండలంలో తొలిరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముందుగా పెద్దమ్మతల్లికి దర్శనం చేసుకుని ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఓటు వేయాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేసడు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని వాళ్ళు ఎలక్షన్ టైం లో ప్రజలు గుర్తుకొస్తారే తప్ప మిగిలిన సమయంలో పట్టించుకునే నాధులే లేరని, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో బాజిరెడ్డి గోవర్ధన్ ఉంటాడని మీకోసం ఎల్లప్పుడూ ఆయన ఇల్లు 24 గంటలు తెరిచే ఉంటుందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు పథకాలు వంటి వచ్చాయని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మూడోసారి బాజిరెడ్డి గోవర్ధన్ ని హ్యాట్రిక్ మెజార్టీతో గెలిపించాలని మన రూరల్ నియోజకవర్గం జిల్లాలో ఆదర్శంగా నిలుపుతాడని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కమలా నరేష్, ఎంపీపీ లతా కన్నీరం, శ్రీనివాసరావు, ఉమాపతిరావు నిమ్మల మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, అజీమ్ సర్పంచులు ఖ్యాతం రవి, సిద్ధార్థ, ముత్యంరెడ్డి, పరుశురామ్, కోల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు