కెంపు భూమయ్య ని పరామర్శించిన బాజిరెడ్డి జగన్

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కెంపు భూమయ్య తల్లి ఇటీవల కాలంలో మృతి చెందడం జరిగింది. రూరల్ నియోజకవర్గం యువ నాయకుడు మరియు ధర్పల్లి జెడ్పిటిసి బాజీ రెడ్డి జగన్ వారి ఇంటికి వెళ్లి కెంపు భూమయ్యను వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఆయన వెంట జెడ్పిటిసి కమలా నరేష్, ఎంపీపీ లత కన్నీరామ్, ఎంపీటీసీ ముత్తెన్న, సాయి రెడ్డి, మోచ్చ శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.