
యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాలలో, స్థానిక తదితర ప్రాంతాలలో పట్టభద్రులను, ఓటర్లను కలిసిన బక్క జడ్సన్ శనివారం కలిశారు. రానున్న ఖమ్మం – వరంగల్- నల్లగొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుక ను బలపరచాలని, జనగామ జిల్లా, యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో, తదితర ప్రాంతాల లో శనివారం వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బక్క జడ్సన్ అను నేను పోటీ చేయుటకు మీ ముందుకు వస్తున్నానని, పట్టభద్రులను వివిధ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను కలసి ప్రశ్నించే గొంతుకను బలపరచాలని ఆయన కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారి ఆకాంక్ష మేరకు నాటి నుండి నేటి వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశానని రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్క జడ్సన్ తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నదని నాటి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై సుమారు 200 పైగా కేసులు దాఖలు చేశానని ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేసుల వివరాలుతో పుస్తకం విడుదల చేశానని ఎన్నో పోరాటాలు చేస్తున్న క్రమంలో అక్రమ కేసులకు భయపడకుండా ఉద్యమిస్తూ ప్రజల గొంతుకగా నాటి నుండి నేటి వరకు పోరాడుతున్నానని నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు మరియు రాష్ట్ర రైతాంగానికి ఎన్నో విధాలుగా మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు నాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొందరు అవినీతి అధికారులతో రాష్ట్రంలో ఖజానాను ఖాళీ చేసి అప్పులపాలు చేశారని, నాటి నుండి పోరాడుతున్న నేను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయుటకు మీ ముందుకు వస్తున్నానని ప్రశ్నించే గొంతుకను బలపరచాలని బక్క జడ్సన్ కోరారు. తాను విద్యార్థి దశ ఎన్ ఎస్ యు ఐ నాయకుని నుండి ప్రజా సేవలో ఉంటూ సామాజిక న్యాయం కోసం ప్రజా సమస్యల పట్ల నాటి నుండి నేటి వరకు ప్రశ్నించే గొంతుకగా పోరాటం చేస్తూ గత పదేండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొట్టి పాలించిన పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై అవినీతి అక్రమాలపై* మెడలు వంచి ఉద్యమిస్తూ నేటి వరకు అదే రీతిలో ప్రజా ఉద్యమ నాయకునిగా ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తున్నాననీ, శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా పోరాడే ఉద్యమ నాయకునిగా ప్రజల పక్షాన ఉన్నత చదువులు చదివిన పట్టభద్రుల పక్షాన పోరాడుతానని విద్య & వైద్యం, ఉద్యోగ, ఉపాధి కోసం నా ప్రత్యేక ఎజెండా ఉంటుందని తెలియపరుస్తూ ప్రశ్నించే గొంతుక బక్క జడ్సన్ అయిన నన్ను రానున్న ఖమ్మం – వరంగల్ – నల్గొండ, పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు