తెలంగాణా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటించి, ఎస్సీ, ఏస్టీ శాఖల అభివృద్ది పథకములను సమీక్ష నిర్వహించారు. అనంతరం శ్రీ యాదాద్రి లక్మి నరసింహ స్వామి వారిని, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునారు. ఈ కార్యక్రమములో ఎస్సీ అభివృద్ది శాఖాధికారి యస్ జైపాల్ రెడ్డి, డిఆర్.డిఓ కృష్ణన్,ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్యామ్ సుందర్, ఎస్సీ శాఖ వార్డెన్స్ లు పాల్గొన్నారు.