
మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండగ సందర్భంగా ఇరు వర్గాల మత పెద్దలను గ్రామ యువకులతోపోలీస్టేషన్‌లో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగాఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ.. పెద్దకొడప్ గల్ మండల వ్యాప్తంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నందుకు అన్ని మతాల పెద్దలను, యువకులను ప్రజలను అభినందించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని గోవులను, లేగదూడలను అక్రమ రవాణా చేయొద్దని సూచించారు. పశువులను ఒకచోట నుంచి మరొక చోటుకు తరలించేనప్పు డు సంబంధిత వెటర్నరీ డాక్టర్ ధ్రువపత్రం తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల ప్రతినిధులు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని ఆయన సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుమహేందర్ రెడ్డి,కో ఆప్షన్ నెంబర్ జాఫర్ష, బిజెపి నాయకులు రమేష్, ప్రణయ్ రెడ్డి,తానాజీ,ప్రేమ్ సింగ్, నేషనల్ హైవే ఇన్సిడెంట్ మేనేజర్ ప్రతాప్ సింగ్,రాజేశ్వర్,కర్తాల్, మైనార్టీలు మహమ్మద్,రషీద్,ఫెరోజ్, గ్రామ యువకులు ఇరుమతాల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.