చండూర్ లో ఘనంగా బక్రీద్ పర్వదినం

నవతెలంగాణ – చండూరు
చండూరు పట్టణంలోని బక్రీదు పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక,అని ఆయన అన్నారు.అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమ్రు,కరెంట్ షరీఫ్,ఏజాస్,జావేద్, నిరంజన్ అలీ,సాదక్, యూనస్, షజ్జు పాష,ఖలీల్,ముజ్జు, జిన్నా, లతీఫ్, భూతరాజు వేణు పాల్గొన్నారు.