చరిత్రను తిరగరాసిన లెజెండ్‌ : బాలకృష్ణ

చరిత్రను తిరగరాసిన లెజెండ్‌ : బాలకృష్ణనందమూరి బాలకష్ణ, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్‌ బస్టర్స్‌ అందించారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్‌’ వారి సెకండ్‌ కాంబోలో ‘లెజెండ్‌’ 2014 మార్చి 28న విడుదలై, ఆల్‌ టైం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్‌ ఈనెల 30న సెన్సేషనల్‌ హిట్‌ని రీ-రిలీజ్‌ చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ ఘనంగా నిర్వహించిన ‘లెజెండ్‌’ బ్లాక్‌ బస్టర్‌ 10 ఇయర్స్‌ వేడుకలో బాలకష్ణ మాట్లాడుతూ,’ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. సౌత్‌ ఇండియాలో నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులను దాటిన ఏకైక సినిమా లెజెండ్‌. సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను’ అని తెలిపారు.
”లెజెండ్‌’ని ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నందమూరి తారకరామారావుకి అంకితం చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆయన ఆశీస్సులతోనే పదేళ్ళ వేడుక జరుపుకుంటున్నాం. ఆ తరానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ ఆ తరానికి లెజెండ్‌. ఈ తరానికి సినిమా రూపంలో మేం చూపించిన లెజెండ్‌ బాలయ్య. ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నాను. రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా కచ్చితంగా సత్తా చాటుతుందనే నమ్మకం ఉంది’ అని బోయపాటి శ్రీను చెప్పారు.