అటవీ సంరక్షణ తోనే ప్రకృతిలో సమతుల్యత..

Balance in nature with forest conservation..– అటవీశాఖ ఆద్వర్యంలో స్వచ్ఛదనం –  పచ్చదనం ర్యాలీ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అటవీ సంరక్షణ తోనే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది అని అశ్వారావుపేట ఎఫ్.ఆర్.ఓ మురళీ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో శుక్రవారం అటవీశాఖ ఆద్వర్యంలో స్వచ్ఛదనం – పచ్చదనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, హరిత హారం ఆవశ్యకత ను నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ,హెచ్ ఎం హరిత, ఉపాద్యాయులు హరిబాబు,నరసింహారావు,దమ్మపేట ఎఫ్ఆర్ఓ కరుణాకర్ చారీ,డీఆర్ఓ జయరాం,ఎఫ్.ఎస్.ఓ శ్రీనివాసరావు,ఎఫ్.బి.ఒ లు నరేష్,మల్సూర్ లు పాల్గొన్నారు.