మాల మహానాడు జిల్లా గౌరవ సలహాదారునిగా బాలయ్య 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
తెలంగాణ మాల మహానాడు సిద్దిపేట జిల్లా గౌరవ సలహాదారునిగా హుస్నాబాద్ కు చెందిన నోముల బాలయ్యను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ తెలిపారు. అంబేద్కర్, పూలే ఆలోచన విధానంతో జిల్లాలో సమన్వయతో పనిచేస్తున్న బాలయ్యను గుర్తించినట్లు పేర్కొన్నారు. బాలయ్యను సలహాదారునిగా నియమించడం పట్ల హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల నాయకులు హర్ష వ్యక్తం చేశారు.