
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు . భీంగల్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా లో సోమవారం జరిగిన టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటమి ని తట్టుకోలేక ఇలాంటి అసభ్యకరమైన మాటలకి పాలపడుతున్నారని రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలకి బాల్క సుమన్ వెంటనే క్షమాపణ లు చెప్పి మాటలని వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేనియెడల బాల్క సుమన్ ను రాష్ట్రంలో తిరగనివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మండల అధ్యక్షులు బొదిరె స్వామి, డిసిసి ప్రదాన కార్యదర్శి కుంట రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య ,మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్పన, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు సుంకరి సురేష్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాక మహేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సేపూర్ చరణ్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి నితీష్ రెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నిచ్చెం మహేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు అర్గుల అక్షయ్, మరియు రాజారెడ్డి, నల్లూరి శ్రీనివాస్, నవీద్, సేవాలాల్, మలావత్ సంతోష్, మహిళ కాంగ్రెస్ నాయకురాలు యమున తదితరులు పాల్గొన్నారు