
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వైఖరిని నిరసిస్తూ మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బొజ్జ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి చెప్పుల చీపురు దండ వేసి చెట్టుకు ఉరితీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను ఈ బడ్జెట్లో అమలు చేస్తామని ప్రకటించడాన్ని చూసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు కురిపిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భయంతో మతి తప్పి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బాల్క సుమన్ అనుచితంగా వ్యవహరించారని ఆయన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొపగొని బసువయ్య, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గరిగే ప్రభాకర్,మానకొండుర్ నియోజకవర్గం యూత్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షారుక్, కిసాన్ సెల్ అధ్యక్షులు రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూర్ సదానందం, నాయకులు దేవు నూరు కిష్టయ్య,దుర్గం సంపత్, తిరుపతి,కనకం హరీష్, అదేపు ఓదెలు, భూమ ప్రవీణ్, నిలవేణి బుచ్చయ్య, మేకల సుభాష్, రాకేష్, మాతంగి యాదయ్య, ,బడిసే శ్రీనివాస్. గోదారి రాజు. కనకం కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.