నవతెలంగాణ – జుక్కల్
మండవంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెలే బాల్క సుమన్ దిష్టి బొమ్మను కాంగ్రేస్ నాయకులు దహనం చేసారు. ఈ సంధర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మ దహనం అనంతరం మండల వర్కింగ్ ప్రసిడెంట్ మాజీసర్పంచ్ అస్పవార్ వినోద్ దొర వేసిన ఎంగిలి బొక్కల మెతుకులు తింటు ఆశపడి దొర గడిలో బానీసల పని చేసే నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వాక్యలు చేస్తు మాట్లాడుతావా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ అవినీతి , అరాచక పాలనను భరించలేక మీ పార్టీని ,మిమ్నల్ని బొంద పెట్టి ప్రజలు కాంగ్రేస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేసారు. ప్రశ్నించే గొంతుకలు నిత్యం ప్రజా సమస్యల పై అలుపేరగని పోరాటాలు చేస్తు కాంగ్రేస్ పార్టీ ని సమన్వయంతో రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి మా ప్రియతమ నాయకుని పై ఆవాకులు చెవాకులు పేలుతు బలుపెక్కిన మాటలు మాట్లాడుతున్న నిన్ను, నీచేత అసబ్యపద జాలంతో మాట్లాడిస్తున్న కేసిఆర్ గర్వాన్ని త్వరలోనే అణిచి వేస్తామని అన్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానీయ యునవర్సిటిలో చేసిన నీచమైన రాజకీయాలకు ఏఒక్కరిన కదిలించిన చెపుతారని తెలిపారు. దళిత నాయకుడిగా ఉండి మీ పదేళ్ల పాలనలో దళితుల పై జర్గిన అన్యాయం పట్ట్ల ఎందుకు మౌనంగా ఉన్నావని అన్నారు. కాంగ్రేస్ ప్రభూత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకుండానేే పరిపాలనలో సమూలమైన మార్పులు చెరపవ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల ఉంటు ప్రజా సమస్యలు పరిష్కరిస్తు ప్రదల చేత మన్నలను పొందుతుంటేే ఏర్వలేక అక్కసుతో ఇలాంటీ నీచమైన వాక్యలు చేస్తున్నావని వచ్చే పార్ల మెంట్ ఎలక్షన్ లో ప్రజలే మీకు బుద్ది చేప్తారని ప్రజలే మీ గోరి కడుతారని అన్నారు. ఇంకోసారీ మా ముఖ్యమంత్రిని ,కాంగ్రేస్ కార్యకర్తల పట్ల ఇలాంటీ దుషణలు చేస్తే చీరి తింతకు కడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల, వివిధ గ్రామాల కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.