
నిజామాబాద్ బాలోత్సవం స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రెసిడెన్సి పాఠశాలలో శుక్రవారం నిర్వహించడం జరిగింది అని స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రధాన కార్యదర్శి నర్రా రామారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రెసిడెన్సి పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలోత్సవములు నిర్వహించే వివిధ రకాల అంశాలను అంశాలవారీగా రివ్యూ చేశారు. నిజామాబాద్ బాలోత్సవం పేరుతో ఒక వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ వెబ్ సైట్ లో నిజామాబాద్ పూర్వ నాలుగు మండలాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు బాలోత్సవానికి పంపించే విద్యార్థుల యొక్క వివరాలను అందులో పొందుపరచవచ్చు. ప్రతిరోజు సుమారు 2000 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి భాగస్వామ్యపు ధ్రుపత్రం గెలిచిన వారికి మెరిట్ సర్టిఫికెట్ మరియు మేమెంటోస్ ప్రెసెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఉచితంగా బ్లడ్ గ్రూపు చేసి వారికి ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంటిలో ఎవరికైనా గుండెపోటు వస్తే సిపిఆర్ ఎలా చేయాలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మొదటిరోజు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పిలువాలని నిర్ణయించారు. రెండవ రోజు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ముఖ్యఅతిథిగా నిర్ణయించడం జరిగిందన్నారు.Website link https://nizamabad-balothsavam.info ద్వారా విద్యార్థులు తమ వివరాలను పొందుపరచాలన్నారు.
నవంబర్ ఏడవ తేదీ వరకు వెబ్ సైట్లు విద్యార్థుల పేరు నమోదు చేసుకోవాలి అది చివరి తేదీ. పోటీల వివరాలు మొత్తం కూడా వెబ్సైట్లో ఉన్నాయి పాఠశాల యాజమాన్యం వెబ్ సైట్ లోకి వెళ్లి సైన్ అప్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని వారి పిల్లల పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే ఆ వెబ్సైట్లో సూచించిన ఫోన్ నెంబర్లకు, లేదా 9866299828, 8886882236, 9985040928 ఫోన్ చేసి సమస్యలు నివృత్తి చేసుకోవచ్చు అని తెలియజేశారు.జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో నవంబర్ 12, 13 తేదీల్లో నిజామాబాద్ బాలోత్సవాన్ని మోపాల్ లోని ప్రెసిడెన్సి స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రధాన కార్యదర్శి నర్రా రామారావు లు తెలిపారు.నిజామాబాద్ పాత మండల పరిధిలోని దాదాపు 200 ప్రైవేటు, ప్రభుత్వ,స్కూల్స్ నుంచి విద్యార్థిని విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొనేందుకు హాజరుకానున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ జయనీ నెహ్రూ, కోయడి నరసింహులు జన విజ్ఞాన వేధిక జిల్లా అధ్యక్షుడు, ప్రసాద్ రావు ఈవీఎల్ నారాయణ, నరేందర్, సుధాకర్, విగ్నేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.