బాల్ర్ నగ గ్రామపంచాయతీ సిబ్బందికి 5 నెల నుంచి జీతాలు లేవు కరోబార్ శేఖర్

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మండలంలోని బాలనగర్ గ్రామపంచాయతీ సిబ్బందికి 5 నెల నుంచి జీతాలు లేవని కారోబార్ శేఖర్ అన్నారు. నాతో పటు ఇంకా ముగ్గురు సిబ్బంది పని చేస్తున్నారని వారికి కూడా జీతాలు లేక కుటుంబం నడిపించలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. గ్రామపంచాయతీలో కారోబార్గా ట్రాక్టర్ డ్రైవర్ గా, బి ఎల్ వో గా పని చేస్తున్నానని అన్నారు. ఐదు నెలల జితం గురించి ఎంపీడీవో గారికి వినతి పత్రం సమర్పిస్తానని తెలియజేశారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఐదు నెలల వేతనం చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు.