మద్నూర్ ఉమ్మడి మండలానికి జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో హనుమంతు యాదవ్ గెలుపు కోసం యువకులు కృషి చేయాలని జుక్కల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు బాలు యాదవ్ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిచ్చారు. ఐవైసీ యాప్ ద్వారా జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో హనుమంత్ యాదవ్ కు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు మెచ్చిన వ్యక్తి నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రశ్నించే నాయకుడు ప్రజా సమస్యల పైన అవగాహన ఉన్న యువ నాయకుడు పదవికి సరైన న్యాయం చేయగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలి అని, యువతకు ఎల్లప్పుడూ ప్రోత్సహించే వ్యక్తి ఇలాంటి యువ నాయకులకు మనం ముందు వరుసలో నిలబడి మద్దతు తెలిపి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరచుకోవడానికి ఇంకా బలంగా తయారు చేయడానికి ఇలాంటి నాయకులు పార్టీ కోసం చాలా అవసరం. కావున మీరందరూ ఆలోచించి హనుమంత్ యాదవ్ కు పూర్తిగా మద్దతు తెలిపి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.