కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన గాంధారి మండల పెట్ సంగెం గ్రామ పరిధిలోని దన్ సింగ్ తండాకు చెందిన జరప్ల సోనియా, అజ్మీర సొన ఎంపిక అయినట్లు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, గుగలోత్ సురేందర్, ఫౌండేషన్ ఛైర్మెన్ సేవంత రాథోడ్ తెలిపారు. నవంబర్ 29, 30తేదీలో కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో జరిగిన ఎంపిక పోటీల్లో వీరు ఎంపిక అయినట్లు వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్, తెలిపారు,ఈ నెల 27నుండి 30వరకు ఆంధ్ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీల్లో వీరు పాల్గొంటారు, ఇదిలా ఉండగా సోనియా వరంగల్ లోనీ వాగ్దేవి వ్యాయామ విద్య కళాశాలలోబిపిఇడి ద్వితీయ సంవత్సరం చదువుతుండగా అజ్మీరా సొన ప్రభుత్వ వ్యాయామ కళాశాల ఖమ్మం లో వ్యాయామ విద్యా ద్వితీయ సంవత్సరం చదువుతుంది, ఎంపిక అయినవీరికి మండల ప్రజాప్రతి నిదులు అభినందించారు