
నవతెలంగాణ-గోవిందరావుపేట
చైనా మాంజా అమ్మకాలు నిషేధం అని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్ ని పతంగుల విక్రయదారులకు ఎస్ ఐ కమలాకర్ తగు సలహాలు సూచనలు చేశారు. మండల పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు చైనా మాంజాతో తలెత్తే అనర్ధాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. ఈ చైనా మాంజాను రవాణా చేసిన, అమ్మిన సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషనులకు గాని, డయల్ 100 గాని ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు.