చక్కెర ఎగుమతులపై నిషేధం..!

న్యూఢిల్లీ : చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించే అవకాశం ఉందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వచ్చే సీజన్‌ అక్టోబర్‌లో చెరుకు దిగుబడి భారీగా పడిపోవచ్చని ప్రభుత్వ వర్గాల అంచనా. మహారాష్ట్ర, కర్నాటకలో సగటు కంటే 50 శాతం తక్కువ దిగుబడి చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో దేశంలో చక్కెర ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి చక్కెర ఎగుమతులపై ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.