ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడాలి

నవతెలంగాణ – జమ్మికుంట
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఓదెల్ కుమార్ అన్నారు. గురువారం జమ్మీకుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఓదేల్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛతా హీసేవా కార్యక్రమంలో భాగంగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ నియంత్రణ పై భారీ ర్యాలీని నిర్వహించారు. కళాశాల నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీని నిర్వహంచారు. ప్లాస్టిక్ ను నిషేదిస్తాం – పర్యవర నాన్ని కాపాడు కుందాం అంటు ప్లేకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేశారు.రైల్వేస్టేషన్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ బాటిల్లనూ  చెత్త చెదారం తోలగించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఓదేలు కుమార్ మాట్లాడుతూ ..నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ ను  ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ వస్తువులను ఆరికట్టాలన్నారు. పర్యావరణాన్ని  కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి ప్రమాదకరంగా ఉన్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికోట్టాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనం గడుపుదామని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆకాడమిక్ కోర్డినేటర్ డాక్టర్ రాజేంద్రం , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్  ఈ రవి, రవీందర్ అధ్యాపకులు డాక్టర్ రాజ్ కుమార్, ఉమా కిరణ్, కిరణ్ కుమార్, డాక్టర్ రవి ప్రకాశ్, డాక్టర్ శ్రీనివాస్, అరుణ్ రాజ్, శ్రీనివాస్, సాయి, శ్రీకాంత్, ఎస్ ఎస్ వలంటీర్లు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.