– స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసిన వర్తక వాణిజ్య వ్యాపారస్తులు.
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో అఖిలపక్ష నాయకులు, ప్రజలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద బంద్ ప్రశాంతంగా ముగిసింది. కవ్వాల్ అభయారణ్యంలో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని, వాహనాలను నిలిపివేయవద్దని కోరుతూ బుధవారం పట్టణంలో బంద్ చేపట్టారు. ఇందులో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని దుకాణాలను మూసివేశారు. హోటళ్లు, కిరాణా, తదితర దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వం స్పందించి అటవీ ఆంక్షలను తొలగించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.. ప్రధాన రహదారిపై ధర్నా చేయాలని వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు భావించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ధర్నాను విరమించుకున్నారు. అటవీ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే అటవీ ఆంక్షలు ఎత్తివేసి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన్నారం ఎస్ఐ రాజ వర్ధన్, దండేపల్లి ఎస్సై కిరణ్ కుమార్, లక్షట్ పేట ఎస్ఐ సతీష్, తమ పోలీసు సిబ్బందితో పహారాకాస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.