విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యాసంస్థల బంద్‌ విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్‌ ఎడమల రమణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో కనీస మౌలిక వసతులు పేక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారన్నారు. పాఠ్యపుస్తకాలు అందించడం జాప్యం జరుగుతుందన్నారు. మన ఊరు మనబడి పథకాన్ని పాఠశాలలలో అమలు చేయడంలో పూర్తిగా విపలమైందన్నారు. ప్రయివేట్‌ పాఠశాలలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద మద్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నాయన్నారు. నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకోవాలని లేనిపక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాజ్‌, పవన్‌ సాయి, అజయ్‌గౌడ్‌, సాయిప్రణయ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.