మండలంలోని బంధాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గుమ్మడి మల్లేష్ తండ్రి, గుమ్మడి పాపయ్య (75) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. ఆదివాసి నాయకుడు గుమ్మడి పాపయ్య మృతి చెందడంతో బంధాల, లింగాల, బొల్లెపల్లి, నర్సాపూర్ (పిఏ) గ్రామాల ప్రజలు తండోపతండాలుగా కదిలారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.