ఎఫ్‌డీ, సేవింగ్స్ ఖాతాలపై అత్యుత్తమ రేట్లు ఆఫర్ చేస్తున్న బంధన్ బ్యాంక్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎఫ్‌డీలపై బ్యాంకింగ్ రంగంలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటిగా ఎంచతగ్గ వడ్డీ రేటును అందిస్తున్నట్లు దిగ్గజ యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ ప్రకటించింది. 500 రోజుల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.35 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు తెలిపింది. ఇదే వ్యవధి గల ఎఫ్‌డీలపై సీనియర్‌యేతరులకు 7.85 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
అలాగే 5 ఏళ్ల కాలవ్యవధి గల ట్యాక్స్ సేవర్ ఫిక్సిడ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటు కూడా బ్యాంకు అందిస్తోంది. ఈ ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీలపై ఇతరులకు 7% వడ్డీ రేటు లభిస్తుంది.

ఈ వడ్డీ రేటు ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రిటైల్ డొమెస్టిక్ / నాన్-రెసిడెంట్ రూపీ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు
 మెచ్యూరిటీ వ్యవధి సీనియర్‌యేతర పౌరులకు వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు
1 సంవత్సరం నుంచి 499 రోజుల వరకు 7.25% 7.75%
500 రోజులు 7.85% 8.35%
501 రోజుల నుంచి 2 ఏళ్ల లోపు 7.25% 7.75%
2  ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 7.25% 7.75%
3  ఏళ్ల నుంచి 5  ఏళ్ల లోపు 7.25% 7.75%
5  ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%

అలాగే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై బ్యాంకు 7% వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.

డొమెస్టిక్ మరియు నాన్-రెసిడెంట్ రూపీ సేవింగ్స్ బ్యాంకు ఖాతా
₹1 లక్ష వరకు రోజువారీ బ్యాలెన్స్ 3%
₹1 లక్షకు పైబడి ₹10 లక్షల వరకు రోజువారీ బ్యాలెన్స్ 6%
₹10 లక్షలకు పైబడి ₹2 కోట్ల వరకు రోజువారీ బ్యాలెన్స్ 7%

బంధన్ బ్యాంకు ఖాతాదారులు తమ ఇల్లు లేదా ఆఫీసు నుంచే సౌకర్యవంతంగా రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్ ద్వారా ఫిక్సిడ్ డిపాజిట్‌ను బుక్ చేయడం లేదా  ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేయడం వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియతో ఎటువంటి అంతరాయాలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్లు ఎఫ్‌డీలను బుక్ చేసుకోవచ్చు.