
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టి, అంటువ్యాధులు సోకకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా కోశాధికారి బండి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యశాఖ సూపర్నెంట్ అంజయ్య కి (పివైఎల్) ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వర్షాల వలన గ్రామాలలో, పట్టణాలలో, విద్యాసంస్థలలో ప్రజలు,విద్యార్థులు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు అంటూ వ్యాధులతో నాన అవస్థలు పడుతున్నారని రోగులకు తగిన వైద్య చికిత్స తక్షణమే అందించాలని అన్నారు. గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో పాము, తేలుకాటులతో మృత్యువాత పడుతున్నారని మండల కేంద్రాలలో వైద్యశాలలో పాము, తేలికాటు మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు.అనారోగ్యాలకు గురవుతున్న ప్రజలకు వైద్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపులను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులతో ఎవరు మృతి చెందిన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ టౌన్ నాయకులు వీరబోయిన లింగయ్య,దండి ప్రవీణ్, భీమ్ రెడ్డి,వినయ్,మహేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.