
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ మతిస్థిమితం లేని, పిచ్చోడిల పూటకో మాట మాట్లాడుతున్నాడని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు విమర్శించారు. శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెల్లారి లేస్తే తెలంగాణ బిల్లును తెలంగాణ ఏర్పాటును అవమానపరిచిన మోడీ భజన చేస్తూ అర్థం కాని మాటలు మాట్లాడుతాడన్నారు. కరీంనగర్ కు ఎలాంటి అభివృద్ధి చేయని నాయకుడు బండి సంజయ్ మనకు వద్దుని ప్రజలు ఉంటున్నారన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు తీసుకునేందుకు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుున్నరని అన్నారు.
ప్రజా సంఘర్షణ యాత్రలో సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో కరీంనగర్ జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన అని మాట్లాడారాని అన్నారు. జైల్లో శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటదని తెలువని బండి సంజయ్ పిచ్చివాడు అనడానికి నిదర్శనమన్నారు. రేపు కరీంనగర్ ప్రజలు ఇచ్చే తీర్పుకు మీకు దిమ్మతిరిగి పోతుందన్నారు. ప్రజల అభిప్రాయ సేకరణ మేరకు బిజెపి నాయకులకు పిచ్చాసుపత్రిలో చేర్చేలా మేము మీకోసం కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ లో ఎర్రగడ్డ తరహాలో ఆస్పత్రిని నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, హుస్నాబాద్ కౌన్సిలర్స్ వల్లపు రాజు ,భూక్య సరోజన, పున్న సది లావణ్య, పోతుగంటి బాలయ్య, సంఘ కుమార్, గాలిపల్లి శ్రీనివాస్ ,ధరావత్ తిరుపతి, లావుడియా వీరన్న నాయక్, కైలు నాయక్, పోలు సంపత్, కేశవిని రమేష్ ,పూదరి శ్రీనివాస్ గౌడ్, గట్టు రాములు గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.