AI ని ఇంటిగ్రేట్ కోసం ఉత్సహం చూపుతున్న బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఎడ్యుకేటర్లు

– Digii సర్వే

భారతదేశం, సెప్టెంబర్ 3, 2024: Digii, ఉన్నత విద్యనందు SaaS ప్రొవైడ్ చేయటంలో ఇండియాలోని లీడింగ్ కంపెనీ, నేడు విలక్షణమైన సర్వేను విడుదల చేసింది, ఇది కొత్తరకమైన సర్వేలకు నాంది అని చెప్పుకోవచ్చు, ఈ సర్వే టైటిల్  ‘AI- డ్రివెన్ ఎడ్యుకేషన్: అధ్యాపకులకు సహాయం చేయడానికి అలాగే విద్యా విజయాలను మెరుగుపరచడానికి AI యొక్క గరిష్ట సామర్థ్యాన్ని ఉపయోగించడం’ అనే పేరుతో విడుదల చేసింది. బెంగుళూరు, ఢిల్లీ మరియు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులతో నిర్వహించిన ప్రత్యేక సర్వే ఇది, ఇందులో విద్యలో AI యొక్క పెరుగుతున్న పాత్రపై అధ్యాపకుల దృక్కోణాలను సంగ్రహించడం వీరి లక్ష్యం. ఈ ప్రాంతాలలో 93% మంది ఫ్యాకల్టీ సభ్యులు AI పట్ల ఉత్సాహంగా ఉన్నారని అలాగే ఇది వారి బోధనా అనుభవాన్ని గణనీయంగా పెంచుతుందని వారు విశ్వసిస్తున్నట్లుగా పరిశోధనలలో వెల్లడి అయ్యాయి.
మణిపాల్ అకాడమీ ఆఫ్ బ్యాంకింగ్, జైన్ (డీమ్డ్ యూనివర్శిటీ), చాణక్య విశ్వవిద్యాలయం, BITSoM, VIT బెంగళూరు, ది అపోలో విశ్వవిద్యాలయం, మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్‌ అండ్  డిజైన్ ఇత్యాదివాటితో సహా దేశవ్యాప్తంగా 22 ప్రముఖ సంస్థల్లోని 500 మందికి పైగా విద్యావేత్తల అంతర్దృష్టులను సేకరించారు, సర్వే అంతటా బోధనా అనుభవంపై AI యొక్క పరివర్తనా సామర్థ్యం మీద దృష్టిని సారించారు. దీనిలో AI సాధనాల్లో శిక్షణ కోసం అధ్యాపకుల సంసిద్ధతను అంచనా వేయటమే కాక బోధనా అభ్యాసాలలో విప్లవాత్మక మార్పులకు సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చు అన్న అంశాలను కూడా పరిశీలించటం జరిగింది.

దాదాపు 41% మంది ఫ్యాకల్టీ సభ్యులు తమ బోధనలో AI ని యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నారని Digii సర్వే వెల్లడించింది. వీటిలో, 70% మంది కంటెంట్ సృష్టి కోసం AI ని వాడుతుండగా, 40.1% మంది అసెస్‌మెంట్‌లను రూపొందించడానికి, 28.4% మంది పర్యవేక్షణ హాజరు కోసం, 24.4% మంది మూల్యాంకనాలను నిర్వహించడానికి ఇంకా 22.5% మంది ఫీడ్‌బ్యాక్ రూపొందించడానికి AIని ఉపయోగిస్తున్నారని తెలిసింది. అదనంగా, 37% మంది AI సాధనాలతో ప్రయోగాలు చేసి చూసారు కానీ ప్రస్తుతం వాటిని ఉపయోగించడం లేదు, అయితే 21.6% మంది తమ బోధనలో AI సాధనాలను ఉపయోగించలేదు. మా సర్వే నందు తెలిసిన అత్యంత ఆశాజనకమైన అంతర్దృష్టులలో ఒకటి బెంగళూరు, ఢిల్లీ మరియు హైదరాబాద్‌లలోని విద్యావేత్తలలో AI- డ్రివెన్ సాధనాలను ఉపయోగించడానికి అపారమైన ఉత్సాహం చూపటం. వారిలో 97% మంది అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి AIని ఉపయోగించడంలో ఆసక్తిని కలిగి ఉండటమే కాకుండా, ఈ సాధనాలను తమ బోధనా పద్ధతుల్లో సమర్థవంతంగా ఏకీకృతం చేయడానికి అవసరమైన శిక్షణను పొందేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు” అని డిజిఐ వ్యవస్థాపకుడు & CEO హేమంత్ సహల్ అన్నారు.
         విద్యా రంగంలో AI పట్ల పెరుగుతున్న ఆసక్తిి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంలో అధ్యాపకులకు సహకరించటానికి వీలుగా, Digii ఇటీవల భారతదేశంలోని 20కి పైగా విద్యా సంస్థలకు DigiiAI అనే కొత్త ఉత్పాదక AI సాధనాన్ని పరిచయం చేసింది. హాజరు ట్రాకింగ్, క్లాస్ షెడ్యూల్ తయారీ, డాక్యుమెంటేషన్, అసెస్‌మెంట్ క్రియేషన్ మూల్యాంకనం వంటి ఎక్కువ సమయం పట్టే పనులను క్రమబద్ధీకరించడానికై ఇది రూపొందించబడింది; అధ్యాపకులకు బోధనా అనుభవాన్ని పెంపొందించే బలమైన స్కేలబుల్ పరిష్కారాన్ని అందించడానికిగాను అధునాతన AI మోడల్‌ల శక్తిని DigiiAI ఉపయోగించుకుంటుంది.